- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది
క్రీడలు స్నేహభావం పెంపొందుతుందని ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ పేర్కొన్నారు.

దిశ, వెంకటాపూర్ (రామప్ప) : క్రీడలు స్నేహభావం పెంపొందుతుందని ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జవహర్ నగర్ లో వాలీబాల్ క్రీడల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామంలో జవహర్ నగర్ వాలీబాల్ ప్రీమియర్ లీగ్ సీజన్ -1 క్రీడలను ఆదివారం నిర్వహించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన కాసేపు క్రీడాకారులతో వాలీబాల్ ఆట ఆడారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రవీణ్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో వాలీబాల్ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని ఆయన నిర్వాహకులను కొనియాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలు శారీరక,మానసిక, ఉల్లాసానికి తోడ్పాటు అందిస్తాయని అన్నారు. యువత సన్మార్గంలో నడవాలనికోరారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాదం ప్రవీణ్ కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ క్రీడల చీఫ్ ఆర్గనైజర్ కిరణ్, హతీష్, మనోజ్, భాస్కర్, రవి కుమార్, కార్తీక్ యూత్ నాయకులు పాల్గొన్నారు.






