- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కొరతతో రైతన్న ఆగమాగం
గోదాంకి వచ్చిన యూరియా స్టాక్ 220 బస్తాలు అయితే 400 మందికి పైగా రైతులను ఉదయం నుండి లైన్లో నిలబెట్టి ఇప్పుడు యూరియా బస్తాలు అయిపోయాయి అనడం సమంజసం కాదని ఈ చేతకాని ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు.

యూరియా కొరతతో రైతన్న ఆగమాగం
- వచ్చింది 220 యూరియా బస్తాలు, రమ్మన్నది 400 మందికిపైగా రైతులను
- సరిపడా లేదని తెలిసినప్పటికి లైన్లో నిలబెట్టడమెందుకు
- చేతగాని ప్రభుత్వంలో అన్ని వర్గాలకు కష్టాలే..
- మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఫైర్
దిశ,శాయంపేట: గోదాంకి వచ్చిన యూరియా స్టాక్ 220 బస్తాలు అయితే 400 మందికి పైగా రైతులను ఉదయం నుండి లైన్లో నిలబెట్టి ఇప్పుడు యూరియా బస్తాలు అయిపోయాయి అనడం సమంజసం కాదని ఈ చేతకాని ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. శాయంపేట మండల పర్యటనలో భాగంగా పత్తిపాక గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలల్లో ఏర్పాటు చేసిన యూరియా పంపిణీ కార్యక్రమాన్ని సందర్శించారు. రైతులు రమణారెడ్డిని చూసి వారి గోడు వెళ్ళబోసుకున్నారు. ఉదయం వచ్చి నిలబడితే కనీసం ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వలేదు అని కన్నీటి పర్యంతమయ్యారు.






