మద్దతు ధర కోసం రైతులు ఆందోళనలు

by velandi.Saikiran |

జనగామ మార్కెట్ లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా కష్టాన్ని గుర్తించ‌లేరంటూ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ముందు తమ

మద్దతు ధర కోసం రైతులు ఆందోళనలు
X

దిశ, జనగామ: జనగామ మార్కెట్ లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా కష్టాన్ని గుర్తించ‌లేరంటూ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ముందు తమ గోడును వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలా చేయడమేంటని వారు నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.2100 పలికిన ధాన్యం ధర, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.1400 ఎలా అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యానికి క్వింటాకు రూ.1400 ఇస్తే రైతులు ఏమైపోవాలని ఆవేదన చెందారు. మద్దతు ధర ఇవ్వకపోతే వెంటనే కొనుగోలు ఆపేయాలని డిమాండ్ చేస్తూ రైతులు వారి గోడును వెల్లబుచ్చారు. కనీసం క్వింటాలుకు 1800 నుంచి 1900 వచ్చినా సంతోష పడే వారమని పేర్కొన్నారు.

స్పందించిన‌ మార్కెట్ కమిటి చైర్మెన్ బనుక శివరాజ్ యాదవ్

రైతులకు మద్దతు ధర ఇప్పించ‌డానికి మేము ముందుంటామని వెల్ల‌డించారు. మా పాలక వర్గ సభ్యులు అంద‌రూ ప్రయత్నిస్తున్నార‌న్నారు. త్వరలో మార్కెట్ యార్డులో 2 ఐకెపి సెంటర్లు ప్రారంభం చేసే విధంగా ప్రయత్నిస్తున్నామని ప్ర‌క‌టించారు.


Next Story