- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. కేటుగాడి డూప్లికేట్ లెటర్ తో షాక్..!
ఉద్యోగాల పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసం చేసిన మంద కళ్యాణ్ ను సోమవారం సుబేధారి పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, హనుమకొండ : ఉద్యోగాల పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసం చేసిన మంద కళ్యాణ్ ను సోమవారం సుబేధారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 2019 నుండి 2024 మధ్యకాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. 2024లో కూడా ఈ మోసం కొనసాగించి, నిరుద్యోగుల నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడు. తాను కేంద్ర ప్రభుత్వంలో ముఖ్య పోస్టులో ఉన్నట్టు చెప్పి నకిలీ అపాయింట్‌మెంట్ లెట్టర్లు ఇచ్చేవాడిగా పోలీసులు గుర్తించారు.
అతను ఇప్పటి వరకు సుమారు 40 మంది నిరుద్యోగులను మోసం చేసి రూ. 16,14,000 వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం మంద కళ్యాణ్ ను అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వ్యక్తి వివరాలు.. మంద కళ్యాణ్ , కూరపాటి భవ్య కిరణ్, తదితరులు ఉన్నారు. నిందితుడి వద్ద నుంచి 39 సర్వీస్ బుక్స్, 23 నకిలీ అపాయింట్‌మెంట్ లెట్టర్లు, 1 హోండా ప్యాషన్ బైకు, 1 i10 కార్, 1 కలర్ టీవీ, 1 సామ్‌సంగ్ సెల్‌ఫోన్ ను పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు.






