- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
చంద్రగ్రహణం ప్రభావం
– హేమాచల దర్శనం నిలిపివేత
దిశ, మంగపేట: ఆదివారం జరిగే సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో మల్లూరు హేమాచల శ్రీలక్ష్మీనృసింహస్వామి గర్భాలయం సహా ఉపాలయాల్లో దర్శనం, నైవేద్యం నిలిపివేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ముక్కామల రాజశేఖరశర్మ, ఈవో మహేష్ తెలిపారు. చంద్రగ్రహణం రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై, రాత్రి 10.59 గంటల వరకు మధ్యకాలం, రాత్రి 1.26 గంటలకు మోక్షం పొందనుంది. ఈ కారణంగా ఆలయంలో ద్వారబంధనం చేపట్టి, భక్తులకు దర్శనం నిలిపివేయబడుతుంది. గ్రహణం అనంతరం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి, ఆ తరువాత భక్తులకు యథావిధిగా స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Next Story






