Medaram Jatara 2026 : మేడారంలో 24/7 సేవలు

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-01-28 10:54:31  IST  )

మేడారం జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్యాధికారి యన్. గోపాలరావు తెలిపారు.

Medaram Jatara 2026 : మేడారంలో 24/7 సేవలు
X

దిశ, మేడారం నెట్వర్క్ : మేడారం జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్యాధికారి యన్. గోపాలరావు తెలిపారు. జాతర ప్రాంగణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతర ప్రాంగణంలోని ఊరటం, నార్లపూర్, కొండాయి, ఆర్టీసీ బస్టాండ్, కన్నెపల్లి ప్రాంతాల్లో 50 మంది ప్రత్యేక వైద్యులు, వైద్య సిబ్బంది 150, పారామెడికల్ అధికారులు 500 మంది, 108 అంబులెన్స్ 40, బైక్ అంబులెన్లు 30, పెరిఫ్రల్ క్యాంప్ లు 30, యన్ రూట్ క్యాంప్ లు 42 సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ కోసం మొదటి రెఫరల్ సెంటర్ ఏటూరునగరం సామాజిక ఆసుపత్రి, రెండవ రెఫరల్ సెంటర్ ఏంజిఎం వరంగల్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయన్నారు. మేడారం, ఏటూరునాగరం, ములుగు ఆసుపత్రుల్లో ప్రసూతి వైద్యం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

MORE NEWS ......

Medaram Jatara 2026G మేడారం జాతరలో మిస్సింగ్ క్యాంపులు

Next Story