ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన జిల్లా అధ్యక్షురాలు ధన్వంతి

by Bhanu |

స్టేషన్‌ ఘనపూర్‌ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని జనగామ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన జిల్లా అధ్యక్షురాలు ధన్వంతి
X

దిశ, ధర్మసాగర్‌: స్టేషన్‌ ఘనపూర్‌ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని జనగామ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన లకావత్‌ ధన్వంతికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. జనగామ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో అన్ని వర్గాల నాయకులను కలుపుకొని ముందకు సాగాలని సూచించారు. పార్టీ పటిష్టానికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అనంతరం లింగాల ఘనపూర్‌ మండలం జీడికల్‌ గ్రామం నుండి మాజీ వైస్‌ ఎంపిపి కొండబోయిన కిరణ్‌ కుమార్‌, కొండబోయిన కేకే రాములు, నర్సిరెడ్డితో పలువురు బిఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గుడి వంశీధర్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శివకుమార్‌, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story