- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
లాభసాటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు.

దిశ, వరంగల్ బ్యూరో : రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా చూడటంతో పాటు, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లాభసాటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, సహకార శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు, ఎరువుల డీలర్లు, క్షేత్రస్థాయి అధికారులతో వానాకాలం సాగు ముందస్తు ఏర్పాట్లు, ఎరువుల పంపిణీ, పంట మార్పిడి విధానాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితులను తట్టుకునే కందులు, జొన్నలు తదితర ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు కలెక్టర్ డా. సత్య శారద.
రైతులకు పంట మార్పిడి ప్రయోజనాలపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు అనుగుణంగా అదనపు యూరియా పంపిణీ కేంద్రాలను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని మండల వ్యవసాయ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లకు సూచించారు. రైతులు ఎరువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాలకు సమీపంలోనే పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, మండలాల స్పెషల్ ఆఫీసర్స్ మండలాల తాసిల్దార్, ఎరువుల డీలర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.






