దిశ ఎఫెక్ట్.. స్పందించిన గ్రామ‌పంచాయ‌తీ అధికారులు

by Ratna Kumari |

మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయతీ గోడలపై సర్పంచ్ ప్రమాణ స్వీకారం రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన‌ ఫ్లెక్సీలను పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు.

దిశ ఎఫెక్ట్.. స్పందించిన గ్రామ‌పంచాయ‌తీ అధికారులు
X

దిశ‌, వెంక‌టాపూర్ (రామ‌ప్ప‌) : మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయతీ గోడలపై సర్పంచ్ ప్రమాణ స్వీకారం రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన‌ ఫ్లెక్సీలను పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. అయితే గ్రామం లో ఇదంతా పెద్ద చ‌ర్చ‌గా మారింది. దీనిపై దిశ పత్రికలో గ్రామ పంచాయతీ కార్యాలయ‌మా.. లేక కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా అనే కథనం ప్రచురితం అయింది. దీంతో గ్రామంలోని ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులు స్పందించి ఎట్టకేలకు గ్రామ పంచాయతీ అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు. దిశ కథనానికి ప్రతి పక్ష నాయకులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story