జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం

by Ratna Kumari |

భూపాల్ పల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో ప్రమాదవశాత్తు పంట పొలాల్లో మంటలు చెలరేగ‌గా.. వాటిని ఆర్పే క్రమంలో ఓ వృద్ధ రైతు శ‌నివారం ప్రాణాలు కోల్పోయారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం
X

దిశ భూపాలపల్లి ప్రతినిధి : భూపాల్ పల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో ప్రమాదవశాత్తు పంట పొలాల్లో మంటలు చెలరేగ‌గా.. వాటిని ఆర్పే క్రమంలో ఓ వృద్ధ రైతు శ‌నివారం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రేపాక గ్రామ శివారులోని పంట పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో, పక్కన ఉన్న గడ్డి కట్టల కు మంటలు అంటుకుంటాయని మంటలను ఆర్పేందుకు చంద్రమౌళి(69) ప్రయత్నించారు. గాలి తీవ్రతకు మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆయన తప్పించుకోలేకపోయారు. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుపోయిన చంద్రమౌళి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాటి రైతు మంటల్లో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

Next Story