- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, హన్మకొండ టౌన్: హన్మకొండ జిల్లా కాంగ్రెస్ యువనేత తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడిచేశారు. సోమవారం రాత్రి హన్మకొండ చౌరస్తాలో హత్ సే హాత్ జోడో రేవంత్ యాత్రలో భాగంగా జరిగిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ శ్రేణులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సభలో రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు కొద్దిదూరంలో ఉన్న యువ నాయకుడు తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తలు దారుణంగా దాడి చేశారు. ఆలస్యంగా గుర్తించిన తోటి కార్యకర్తలు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం తోట పవన్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఈ సంఘటన సంచలనంగా మారింది. కాంగ్రెస్‌లోని వర్గపోరే పవన్‌పై దాడికి కారణమా..? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా..? అనే విషయం తెలియాల్సి ఉంటుంది.
Next Story






