కాంగ్రెస్ పార్టీ లో ఫ్లెక్సీ చిచ్చు.. ఆత్మకూరులో కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం..

by Bhanu |

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ లో ఫ్లెక్సీ చిచ్చు.. ఆత్మకూరులో కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం..
X

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీకి చెందిన ఓ నాయకుడు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సంఘటన స్థానికంగా రాజకీయ ఉష్ణోగ్రతను పెంచింది. ఆత్మకూర్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయమై, ప్రోటోకాల్ ప్రకారం ఓ వర్గానికి చెందిన మండల అధ్యక్షుడి ఫోటో లేకపోవడం పై ఆ అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ప్రోటోకాల్ ప్రకారం అధికారి స్థాయిలో ఉన్న నేతలే ఫ్లెక్సీ లో ముందు వరుసలో ఉండాలి, కానీ ఇక్కడ వ్యక్తిగత ప్రాధాన్యతకు ప్రాధాన్యం ఇవ్వడం క్షమించదగినది కాదు అని ఆయన ఆగ్రహంతో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఇద్దరి నాయకుల మధ్య మాట మాట పెరిగి దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. మిగతా నేతలు మద్యప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది.

పార్టీలోకి కొత్తగా వచ్చినవాళ్లు పెత్తనం చేసేందుకు చూస్తున్నారా..?

ఈ సంఘటనతో కాంగ్రెస్ పార్టీలోని లోతైన అంతర్గత రాజకీయాలు బయటపడినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. కొంతమంది నేతల అభిప్రాయం ప్రకారం.. పరకాల నియోజకవరగానికి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం, ఆయన్ను అనుసరించే నేతలు పార్టీలోకి వచ్చి కీలక స్థానాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని జోరుగా విమర్శలు రావడం గమనార్హం.! ఇదంతా కొత్త నేతల సొంత ప్రచారానికి దారితీసే చర్యలు. పాత నేతలను పక్కన పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని కొందరు వ్యాఖ్యానించారు. పార్టీలో పాత వర్గాలు.. కొత్త వర్గాల మధ్య సమన్వయం లేకపోవడం, స్థానిక స్థాయిలో ఉద్రిక్తతలకు కారణ మవుతోందని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విశ్వాసం కోల్పోతున్న కార్యకర్తలు.. పార్టీ పట్ల నిరాశ..

ఇలాంటి సంఘటనలు కార్యకర్తలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పార్టీ లోపలే ఓ వర్గం అంటోంది. వాస్తవానికి ఫ్లెక్సీలు పార్టీకి మద్దతుగా ఉండాలి కానీ, వివాదాలకు వేదిక కావడం బాధాకరమని వారు అభిప్రాయపడుతున్నారు.ప్రజల నమ్మకాన్ని గెలుచు కోవాలంటే పార్టీలో ఐక్యత అవసరం. కానీ ఇలాంటి ప్రదర్శనలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి అని పార్టీ లోని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానిక నేతల్లో విభేదాలకు దారి మళ్లించినట్లుగా తెలుస్తుంది. ఈ సంఘటన మండలంలో హాట్ టాపిక్ గా మారిందని, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకోవడం గమనార్హం.



Next Story