ఈ ప్రాజెక్టలను త్వరగా పూర్తి చేయండి

by Naveena |

రానున్న 15నెలలలో దేవాదుల ప్రాజెక్టను పూర్తి చేసి, వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

ఈ ప్రాజెక్టలను త్వరగా పూర్తి చేయండి
X

దిశ, జనగామ: రానున్న 15నెలలలో దేవాదుల ప్రాజెక్టను పూర్తి చేసి, వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇందుకు నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు సహకరించాలని మాజీ ఉప ముఖ్యమంత్రిని కోరారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషాతో కలిసి నీటి పారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ అని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని 7మండలాలకు సాగు నీరు అందించే ప్రాజెక్ట్ అందుకే దేవాదుల ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత లిస్ట్ లో చేర్చడం జరిగిందన్నారు. 15నెలలలో పెండింగ్ పనులన్నింటిని పూర్తి చేయాలన్నారు. ఇందుకు కలెక్టర్, సీఈ నెలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతీ కెనాల్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీస్ పైన సమీక్ష నిర్వహించాలని,అధికారులు అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) రోహిత్ సింగ్, నీటిపారుదల సీఈ, ఎస్సీఈలు, ఈఈలు, డీఈలు ఇతర నీటిపారుదల శాఖ అధికారులు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story