పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Kodari Anjali |

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.

పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, జనగామ: జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌తో పాటు డీసీసీ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రబిందువుగా నిలుస్తుందని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీతో పాటు అనుబంధ సంఘాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్ కృషి చేస్తున్నారని కొనియాడారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

అభివృద్ధికి అంకితభావంతో...

అందరి సహకారంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేస్తామని తెలిపారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు, టీపీసీసీ సభ్యులు, డీసీసీ కమిటీ ఆఫీస్ బేరర్లు, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, పీఏసీఎస్ సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story