- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేవెళ్ల సాక్షిగా మోసం చేసి.. ఎస్సీ ఉద్యోగులతో సన్మానాలా..? : R.S. ప్రవీణ్ కుమార్
చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీ ప్రజలను మోసం చేసి ఏ ముఖం పెట్టుకొన్న శిల్పకళావేదికలో రేవంత్ రెడ్డి ఎస్సీ ఉద్యోగుల చేత సన్మానం చేయించుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీ ప్రజలను మోసం చేసి ఏ ముఖం పెట్టుకొన్న శిల్పకళావేదికలో రేవంత్ రెడ్డి ఎస్సీ ఉద్యోగుల చేత సన్మానం చేయించుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీలకు ఏం చేశారో శిల్ప కళా వేదికగా ఎస్సీ ఉద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 12 లక్షల ఆర్థిక సాయం, 18 శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల హామీలు ఏమయ్యాయో వివరణ ఇవ్వాలని అన్నారు. శుక్రవారం హనుమకొండ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పేరుతో ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రగతే లేనప్పుడు,ప్రగతి ప్రణాళిక ఎందుకంటూ ఎద్దేవా చేశారు. రాంజీ నగర్ గ్యాంగ్ అటెన్షన్ డైవర్ట్ చేసి బంగారం ఎత్తుకోపోయినట్టు.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చే కార్యక్రమమే ప్రగతి ప్రణాళిక కార్యక్రమమని స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజల దృష్టిని మార్చే ప్రయత్నమే చేస్తుంది. కాళేశవరం కూల్చి పిసి ఘోష్ కమీషన్ వేసింది. విద్యుత్ కుంభకోణం జరిగిందని చెప్పి, జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ వేసి కాలయాపన చేసింది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కుడా చైర్మెన్ యాదవ రెడ్డి, కార్పొరేటర్లు ఇమ్మడి రాజు,జన్ను జకర్య, గబ్బెట శ్రీను, మంద శ్యాం, జంపన్న, చక్రి, సదాంత్, పూర్ణచందర్, ప్రశాంత్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.






