స్టేషన్ ఘనపూర్ లో రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు

by velandi.Saikiran |

స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రిజర్వాయర్‌లోకి ఓ షిఫ్ట్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటన చిల్పూరు మండలం దేశాయి తండా సమీపంలో జరిగింది.

Car plunges into reservoir at Station Ghanpur
X

Car plunges into reservoir at Station Ghanpur

*రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు*

*ఓ వ్య‌క్తికి తీవ్ర గాయాలు*

*ఆస్ప‌త్రికి త‌ర‌లించిన స్థానికులు*

దిశ, జనగామ: జనగామ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రిజర్వాయర్‌లోకి ఓ షిఫ్ట్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటన చిల్పూరు మండలం దేశాయి తండా సమీపంలో జరిగింది.స్టేషన్ ఘనపూర్ నుండి దేశాయి తండా వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రిజర్వాయర్‌లో పడినట్లు సమాచారం. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ధారావత్ చరణ్ (18) కు తీవ్ర గాయాలు అయ్యాయి. కారు అద్దాలు పగలడంతో అతను గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే స్పందించి, అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Next Story