- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
నలుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

దిశ, గీసుగొండ: నలుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్ మహానగరపాలక సంస్థ 17వ డివిజన్ వసంతపురం గ్రామ శివారులో కారు ప్రమాదం జరిగింది. గీసుగొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TS03FF3486 నెంబర్ గల షిఫ్ట్ డిజైర్ కారులో నలుగురు యువకులు సంగెం మండలం కోట వెంకటాపురం గ్రామం నుండి వసంతపురం గ్రామం వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా కారు వెనకవైపు ఉన్న ఎడమ టైరు పేలి కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టింది.
కారు డ్రైవింగ్ చేస్తున్న యువకుడు, ముందు సీట్లో కూర్చున్న ఎండి సమీర్ పాషా, ఎండి ఇస్మాయిల్ అలీకి గాయాలవ్వగా వెనుక కూర్చున్న షేక్ మహమ్మద్(18), ఎండి షాబుద్దీన్ (17)అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని, చనిపోయిన వారి మృతదేహాలను ఎంజీఎంకు తరలించినట్టు సీఐ ఎ.మహేందర్ తెలిపారు. కాగా షేక్ మహమ్మద్ చింతల్, మహమ్మద్ షాబుద్దీన్ ఎల్బీనగర్, ఎండి సమీర్ పాష ఎల్బీనగర్, ఎండి ఇస్మాయిల్ అలీ జాన్ పాకకు చెందిన వారిగా తెలిపారు.






