70 వేల విలువైన గంజాయి పట్టివేత

by velandi.Saikiran |

నెల్లికుదురు పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా మరో విజయాన్ని సాధించారు. ఈరోజు, తేదీ 19-08-2025 ఉద

70 వేల విలువైన గంజాయి పట్టివేత
X

దిశ, కేసముద్రం : నెల్లికుదురు పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా మరో విజయాన్ని సాధించారు. ఈరోజు, తేదీ 19-08-2025 ఉదయం 6:30 గంటలకు రామకృష్ణ క్రాస్ వద్ద పోలీసులు పహారా నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడం తో పోలీసులు అతన్ని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద 1.4 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ: 70,000. ఉంటుందని, విచారణలో నిందితుడు తాను నెల్లికుదురు పరిసర గ్రామాలకు చిన్న చిన్న ప్యాకెట్లుగా (100 గ్రాముల చొప్పున) గంజాయి అమ్మడానికి వెళ్తున్నానని ఒప్పుకున్నాడు.

అతని వివరాలను సేకరించగా, అతను కేలోత్ చందూలాల్, తండ్రి మాన్ సింగ్, వయసు 77 సంవత్సరాలు, కులం లంబాడా, రేగుల గ్రామం, కొడకండ్ల మండలం అని తేలింది. తన చిన్న కుమారుడు కేలోత్ నవీన్‌తో కలిసి రాజమండ్రి ప్రాంతం నుండి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, నెల్లికుదురు పరిసర గ్రామాల్లో అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. వెంటనే పోలీసులు అతనిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో చూపిన అప్రమత్తతకు, సమర్థతకు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ ఐపీఎస్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపుతోందని, ఎవరు గంజాయి సాగు లేదా సరఫరాలో పాలుపంచుకున్నా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

Next Story