- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతంపై నేతలు కదిలారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు.

దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతంపై నేతలు కదిలారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. పార్టీ డిజిటల్ సభ్యత్వాన్ని నమోదు చేయడంతో పాటు గ్రామ గ్రామాన సంస్థాగత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ధాన్యం, మక్కల కొనుగోలు తీరుపైన చర్చించారు. రైతులకు అండగా ఉంటూ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు అయ్యేంతవరకు పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు.
జనగామలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆలూరు రమేష్, నన్నపనేని నరేందర్ తో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సభ్యత్వాన్ని పూర్తిస్థాయిలో చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాలు మండలాల పరిధిలో కార్యకర్తల ద్వారా డిజిటల్ సభ్యత్వాన్ని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంఖ్య కన్నా పనిచేసే కార్యకర్తలను సభ్యులుగా చేర్చుకోవడంతో పాటు సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి పెట్టారు. గ్రామ గ్రామాన బూతుల వారిగా సభ్యత్వ నమోదును చేయడంతో పాటు పూర్తిస్థాయిలో క్యాడర్ కు అందుబాటులో ఉండి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు, రైతుల సమస్యలు రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ధాన్యం కొనుగోలు చేసేంతవరకు పూర్తిస్థాయిలో రైతులకు మద్దతుగా ఉండటంతో పాటు కొనే విధంగా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల వారిగా సమస్యలపై చర్చించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి దారుణంగా మారిందని వడ్లు, మొక్కజొన్నలు సక్రమంగా కొనుగోలు చేయడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయని అన్నారు. బస్తాల కొరత ఉందని కొనుగోలు సక్రమంగా జరగడం లేదని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలుతో పాటు రవాణాకు కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయని అన్నారు. మిల్లులకు వెళ్లిన, గోదాములకు వెళ్లిన ధాన్యం సరిగా దించడం లేదని రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ఇప్పటికీ సగం కూడా కొనుగోలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో రైతుల సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కల్లాలలో కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతుల సమస్యలపై ఆందోళన చేస్తే తప్ప కనీసం కొనుగోలు చేయడం లేదన్నారు. గ్రామాల్లో సభ్యత్వ నమోదును భారీగా చేయడంతో పాటు ప్రజలందరిని భాగస్వాములు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదుకు ప్రతి ఒక్కరు సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సుధీర్ కుమార్, నాగొళ్ల వెంకన్న, వాసుదేవరెడ్డి, సమ్మారావులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.






