- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టివేత..
హనుమకొండ జిల్లా కుమార్‌పల్లి ప్రాంతంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ నిల్వపై పోలీసులు దాడులు నిర్వహించారు.

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా కుమార్‌పల్లి ప్రాంతంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ నిల్వపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ పురోహిత్ మహేందర్, రాజ్ పురోహిత్ మోడ్ సింగ్ అనే వ్యక్తులు తమ నివాస ప్రాంగణంలో నిషేధిత ఉత్పత్తులను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించి, దాదాపు రూ.3.20 లక్షల విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల్లో ఒకరైన మోడ్ సింగ్ అదే ఏరియాలో కిరాణా షాపు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల దుకాణాలకు ఈ నిషేధిత పొగాకు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అతను అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తున్నాడని హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్ వెల్లడించారు.
ఈ దాడిలో క్రైం పార్టీ సిబ్బందిగా పనిచేసిన అశోక్, రావుస్, మహిపాల్, మహిళ ఏఎస్సై కమల, సిబ్బంది కారుణ్య, రమ్యలను సీఐ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిషేధిత పొగాకు పదార్థాలను నిల్వ ఉంచినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి చట్టపరంగా ముందడుగు వేస్తామని హెచ్చరించారు.






