ప్రమాదకరంగా ’అత్తచెరువు‘ తూము

by velandi.Saikiran |

మండలంలోని మల్లూరు అత్తచెరువు తూము తప్పు పట్టి ప్రమాదకరంగా మారింది.

ప్రమాదకరంగా ’అత్తచెరువు‘ తూము
X

దిశ, మంగపేట : మండలంలోని మల్లూరు అత్తచెరువు తూము తప్పు పట్టి ప్రమాదకరంగా మారింది. ఈ త‌రుణంలో తూము రిపేరు చేయకుండా ఐబీ అధికారులు, కేవ‌లం ఇసుక బస్తాలు వేసార‌ని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధ‌వారం చెరువు తూమును సందర్శించి పరిశీలించిన రైతులు, ఐబీ అదికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స‌మ‌స్య‌పై చాలా సార్లు ఫిర్యాదు చేసామ‌ని, అయినా రెండు సంవత్సరాలుగా స్పందించడంలేదని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా రెవిన్యూ, ఐబీ అధికారులు జాయింట్ సర్వే చేసి, ఆక్రమణకు గురైన చెరువు శిఖం ఆధీనంలోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా ఉన్న తూము షట్టర్ ను చెరువు నిండక ముందే రిపేరు చేయించాలని కోరారు.

Next Story