- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచిత యూపీఎస్సీ ,సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణను అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణను అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెందిన నిరుద్యోగ యువత శిక్షణకు అర్హులని, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలని కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకుండా ఉండాలని తెలిపారు. శిక్షణ కోసం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 19న హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ యూనివర్సిటీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని, జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం tsstudycircle.co.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ డెవలప్మెంట్ అధికారి కొమురయ్య, ఏవో అల్లం రాజ్ కుమార్, ఎస్ ఓ లాల్ తదితరులు పాల్గొన్నారు.






