పేదల జీవితాల్లో వెలుగులు నింపాలి: ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్

by Web Desk |
పేదల జీవితాల్లో వెలుగులు నింపాలి: ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్
X

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్: పేదలు జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వాలు సరైన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు అన్నారు. ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి తక్కళ్ళపల్లి పురుషోత్తమరావు నివాసంలో తెలంగాణ జనవేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్ జూమ్ సదస్సు జరిగింది. తెలంగాణ వ్యవస్థాపక కన్వీనర్ తక్కళ్ళపల్లి రాము నేతృత్వంతో ప్రపంచీకరణ- ప్రపంచ వాణిజ్య సంస్థ- భారత్ ధృక్పథం అనే అంశంపై జరిగిన సదస్సుకు ప్రొఫెసర్ ప్రసాదరావు హాజరై కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ దేశాలను ఆర్థికంగా ప్రపంచీకరణ అనుసందానం చేస్తుందన్నారు. ప్రపంచం గ్లోబల్‌గా విలేజ్ మారిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు ప్రపంచీకరణ మంత్రంగా మారిందన్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో మన దేశంలో పేదలు, పేదలుగానే జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఎగుమతులు, దిగుమతుల్లో సంబంధాలు పెరిగాయన్నారు. ప్రధానంగా సాంకేతిక విప్లవం ఏర్పడిందని, ఐటీ రంగం విస్తృతంగా వృద్ధిలోకి వచ్చిందన్నారు. యువత ఎక్కడైనా సాంకేతిక విద్యతో జీవించవచ్చునని అన్నారు.

తెలంగాణ జనవేదిక కన్వీనర్ తక్కళ్ళపల్లి రాము మాట్లాడుతూ.. ప్రపంచీకరణ లాభనష్టాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సుకు సంయోజకులుగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ వ్యవరించగా బజార్ రంగారావు, బి.కృష్ణప్రసాద్, ప్రశాంత్, డాక్టర్ కేవీ సోమనాథ్, జేమ్స్ ప్రశాంత్, డాక్టర్ పైడితల్లి దుప్పల, ఎం.మోహన్రావు, వి.మురళి, జంగా మోహన్రావు, దిమ్మెల రాజ, డాక్టర్ బోస్, ప్రొఫెసర్ కందకట్ల సుధాకర్, సత్యప్రసాద్, అరవింద్, విజయ ప్రకాశ్, మనోజ్, స్వాతి మిశ్రా, లీలా వెంకటేశ్వర్రావు, ఉమా మహేశ్వర్రెడ్డి, ఆదిలక్ష్మి, దిపెందు చౌదరి, చంద్రకళ, వజీద్, పరమేశ్వర్రావు, కొండపల్లి ఎర్ర శ్రీధర్ రాజు, జీవన్ కుమార్, అంజన్ రావు, సౌమింద్ర కిశోర్ దత్త, పద్మజా కలుత్తూరి, ప్రొఫెసర్ చింతకింది రాజేశం, కె.పద్మ, అహ్మద్ బేగ్, పెండ్లి అశోక్ బాబు, ప్రవీణ వైట్ల, ఎస్.రామాంజనేయులు, బిడ్జు శ్యాం, ప్రొఫెసర్ బిష్ణు చరణ్ చౌదరి, మట్టెడ కుమార్, సింహద్రినాయుడు, బుస్సా లక్ష్మినారాయణ, సీహెచ్ శంకర్రావు, బొండ రామకృష్ణ, అశోక్ కుమార్, ఎన్.రవీందర్రెడ్డి, మధుసూధన్, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్, పి.హృషికేశ్వర్రావు, మంద సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story