ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తున్న వానర సైన్యం

by Ratna Kumari |

వానర సైన్యం మనుషులపై దాడులకు దిగుతున్నది. ఏకంగా కలెక్టర్ కార్యాలయంలో కోతులు ప్రతిరోజు పరిసరాల ప్రాంతాల్లో తిరుగుతూ ఉద్యోగులను సామాన్య ప్రజలను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.

ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తున్న వానర  సైన్యం
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : వానర సైన్యం మనుషులపై దాడులకు దిగుతున్నది. ఏకంగా కలెక్టర్ కార్యాలయంలో కోతులు ప్రతిరోజు పరిసరాల ప్రాంతాల్లో తిరుగుతూ ఉద్యోగులను సామాన్య ప్రజలను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం పలు రకాల పచ్చని చెట్లతో ఉండడంతో కోతులు చెట్లపై తిరుగుతూ నడిచి వెళ్తున్న ఉద్యోగులను, సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతి ఉద్యోగి తన విధులు నిర్వహించడానికి వెళ్తున్న సమయంలో చేతిలో కర్ర లేకుండా వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంది. మంగళవారం ఉదయం కోతులు చెట్ల పై తిర‌గ‌డ‌మే కాకుండా నేలపై తిరుగుతున్న సమయంలో ఉద్యోగులు తమ విధులు నిర్వహించడానికి వెళ్తున్న సమయంలో చేతిలోని బ్యాగులను తీసుకుపోతున్నాయి. అంతే కాకుండా కరవడానికి సైతం సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో పలు కార్యాలయాలో పని చేసే ఉద్యోగులు గంటల తరబడి రోడ్డు పైనే నిల్చొని ఉన్నారు. ఏకంగా కోతులు కార్యాలయాల లోపటికి చొరబడి అందినంత అందుకు పోతున్నాయి. కోతుల ఇబ్బందులు తొలగించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.

Next Story