- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన SSC బ్యాచ్
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ కరీష్మా గార్డెన్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. మ

X
దిశ, హన్మకొండ : హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ కరీష్మా గార్డెన్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. మడికొండ జడ్పీహెచ్‌సీ పాఠశాలలో 2004-2005 పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత ఒక్క చోటకు చేరారు. వివిధ వృత్తుల్లో, ఉద్యోగాల్లో స్థిరపడిన వారంతా తమ అనుభవాలను, జ్ఞాపకాలను స్నేహితులతో పంచుకున్నారు. చిన్ననాటి సంగతులను, ఉపాధ్యాయులు, స్నేహితులతో అనుబంధాన్ని, పాఠశాలతో ఈ ప్రాంతంతో పెనవేసుకున్న బంధాలను తమ ప్రసంగాల్లో వెల్లడించారు. ఎంతో ఉల్లాసంగా సాగిన ఈకార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులకు సన్మానం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఇలా తమను గుర్తుంచుకుని గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
Next Story






