- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కెట్ విలువ పెంపు, భూభారతి, హౌసింగ్, హీట్ వేవ్స్ అంశాలపై సమీక్ష
జిల్లాలో భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : జిల్లాలో భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూములు మార్కెట్ విలువ పెంపు, భూభారతి దరఖాస్తులు, హౌసింగ్, హీట్ వేవ్స్ అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాలని సంబంధిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
హౌసింగ్ అంశంపై మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హీట్ వేవ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తాగునీటి సదుపాయాలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, వైద్య సేవలు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతల దృశ్య పశుపక్షాదులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సోమవారం రోజున నిర్వహించే జిల్లా స్థాయి ,డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కు వచ్చే ప్రజలకు అధిక ఉష్ణోగ్రత నమోదు దృశ్య గ్రీన్ షేడ్ ఏర్పాటుచేసి దరఖాస్తుదారులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, డిఆర్ఓ విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, డిఎం అండ్ హెచ్ ఓ సాంబశివరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ, ఈ-సూపరింటెండెంట్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, జీడబ్ల్యూఎంసీ అధికారులు పాల్గొన్నారు.






