ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారణ చేపట్టాలని వినతి

by Ratna Kumari |

మండలంలోని మైలారం గ్రామానికి చెందిన చల్ల సంజీవరెడ్డి గతంలో ఎస్సారెస్పీ చైర్మన్‌గా పని చేసిన సమయంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారణ చేపట్టాలని వినతి
X

దిశ, శాయంపేట : మండలంలోని మైలారం గ్రామానికి చెందిన చల్ల సంజీవరెడ్డి గతంలో ఎస్సారెస్పీ చైర్మన్‌గా పని చేసిన సమయంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు శాయంపేట గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ దేనంపల్లి సుమన్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎస్సారెస్పీ 31 డీబీఎం కెనాల్‌కు ఆనుకొని ఉన్న సీతకుంటకు సంబంధించిన ప్రభుత్వ భూమి సర్వే నెంబర్లు 540, 542, 543లను చల్ల సంజీవరెడ్డి తన కుమారుడు చల్ల తిరుపతిరెడ్డి పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామ ప్రజల్లో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదిగా ఉండగా.. అధికార దుర్వినియోగంతో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సర్వే నెంబర్లపై, అలాగే సీతకుంట చెరువుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story