చిన్న వరదకే కొట్టుకుపోయిన కట్ట

by Elthuri vijay kumar |

రూ. కోటీ అరవై లక్షలతో బీఆర్ఎస్ హయాంలో 2.4 కిలోమీటర్ల కాల్వ పునరుద్ధరణ..

చిన్న వరదకే కొట్టుకుపోయిన కట్ట
X

చిన్న వరదకే కొట్టుకుపోయిన కట్ట

- రూ. కోటీ అరవై లక్షలతో బీఆర్ఎస్ హయాంలో 2.4 కిలోమీటర్ల కాల్వ పునరుద్ధరణ..

- కాంట్రాక్టర్, ఇంజనీర్ల మాయాజాలం..

- నాసిరకం పనులతో లక్షల రూపాయలు వృథా..

దిశ, ఎల్కతుర్తి : అనంతసాగర్ – ఎల్కతుర్తి మాటుకాల్వ పరిస్థితి దయనీయంగా మారింది. 2.4 కిలోమీటర్ల పొడవున్న ఈ కాల్వను బీఆర్ఎస్ హయాంలో రూ.1.60 కోట్లతో పునరుద్ధరించినప్పటికీ చిన్న వరదకే కట్ట కొట్టుకుపోయింది. కాంట్రాక్టర్ – ఇంజనీర్ల మాయాజాలం, నాసిరకం పనుల వల్ల లక్షలాది రూపాయలు వృథా అయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్వపై ఎక్కడికక్కడ ఆక్రమణలు జరిగి, కాల్వ నిండా తుంగ, తుమ్మ చెట్లు పెరిగి సాగునీరు సరిగా రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం కేవలం వర్షపు నీటితో నిండే ఎల్కతుర్తి ఊర చెరువుకు వరదనీరు మళ్లించే ఈ కాల్వ పాడైపోవడంతో మండల కేంద్రంలోని మూడు చెరువుల కింద ఉన్న ఆయకట్టు దెబ్బతింటోంది. “చెరువుల్లో మొరంపై శ్రద్ధ చూపుతున్న అధికారులకు చెరువుల్లో నీళ్లు నింపే కాల్వపై మాత్రం కనీస శ్రద్ధ లేదు”అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కాల్వ పునరుద్ధరణ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story