- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం ఎఫెక్ట్.. ఈ వేసవిలో మందుబాబులకు BIG షాక్!
మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం.. గాజు బాటిళ్ల తయారీ ఖర్చు పెరగడంతో భారత్‌లో మద్యం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్ భారత్‍లోని దాదాపు అన్ని రంగాలపై పడుతోంది. ఇప్పటికే గ్యాస్ లభ్యత విషయంలో అన్ని రంగాలు ప్రభావితం అవుతుండగా తాజాగా ఈ వార్ మందుబాబుల పాలిట శాపంగా మారబోతోంది. అంతర్జాతీయంగా సప్లై చైన్‍లో తలెత్తిన ఆటంకాల కారణంగా భారత్‍లోని మద్యం బాటిళ్ల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఆ పెంపు భారం మద్యం ప్రియుల జేబులు గుల్ల చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ వేసవిలో చల్లగా చిల్ అవుదామనుకునే మందుబాబుల మాడు పగలగొట్టేలా కనిపిస్తోంది.
బాటిళ్ల తయారీపై ఎఫెక్ట్:
ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం తయారీలో ఉపయోగించే ముడి సరుకు కంటే ప్యాకేజీ ఖర్చే కంపెనీలకు భారంగా మారింది. మద్యం బాటిళ్లు తయారు చేయారీలో గాజు ఫర్నెస్(కొలిమి)లను నిరంతరం మండించాల్సి ఉంటుంది. దీనికి గ్యాస్ తప్పనిసరిగా కావాలి. అయితే భారత్ తన సహజవాయువు అవసరాల కోసం 40 శాతం వరకు ఖతార్‍పైనే ఆధారపడుతోంది. కానీ ఈ యుద్ధం కానీ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బీర్ తయారీ ఖర్చులో ప్యాకేజింగ్ వాటా 40 శాతం కాగా, స్పిరిట్స్ (విస్కీ, బ్రాండీ తదితరాల్లో) ఇది 20 శాతం వరకు ఉంటుంది. గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడటం వల్ల అది నేరుగా గాజు బాటిళ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన గ్యాస్ కష్టాలు, కమర్షియల్ గ్యాస్ ధరల వల్ల గాజు బాటిళ్ల ధర 15-20 శాతం పెరినట్లు ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ చోప్రా అంచనా వేశారు.






