- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ ఉద్యోగులకు వేతన కష్టాలు..
గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12వేలకు పైగా ఉద్యోగులకు ఏ నెల వేతనం ఆ నెల వచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్ ఉద్యోగుల తరహాలో ఉపాధి హామీ ఉద్యోగులకు కూడా పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఇంత వరకు దాని అతీగతి లేదని వాపోతున్నారు. పే స్కేల్దేవుడు ఎరుగు కనీసం తమకు వచ్చే వేతనాలు కూడా సరిగా రావడం లేదని చెబుతున్నారు. రెండు, మూడు నెలలకు ఒక సారి వేతనాలు ఇస్తున్నారని, అది కూడా ఒక్కొ కేడర్‌కు ఒక్కో సారి వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ ఉద్యోగులందరు ఒకేసారి వేతనాలు రావాల్సి ఉండగా అదేమి జరగడంలేదని, పిల్డ్అసిస్టెంట్లకు ఒకసారి, ఆపరేటర్లకు ఒకసారి, టెక్నికల్ అసిస్టెంట్లకు మరోసారి ఇలా మూడు నెలల పాటు సాగిస్తున్నారని అంటున్నారు. కేంద్రం నుంచి సరియైన సమయంలో వేతనాలు రావడం లేదని, కేంద్రం విధిస్తున్న షరతులతోనే ఉద్యోగులకు వేతనాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు ఉద్యోగులకు సమాధానాలు ఇస్తున్నారు.
కేంద్రం ఉపాధి హామీ నిర్వహణ కోసం మొత్తం ఖర్చు అయ్యే నిధుల్లో ఆరు శాతం నిర్వహణ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఆరు శాతం నిధులు నిర్వహణకు సరిపోవడం లేదని, పని దినాలు, వారి కూలీ తక్కువగా అయినప్పుడు ఆరు శాతం నిధులు సరిపోక వేతనాలకు కష్టం అవుతుందని వివరిస్తున్నారు. అధికంగా అయ్యే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, ఉద్యోగులందరు రాష్ట్రానికి చెందిన పౌరులే అయినందున వారి సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కొంత మొత్తం భరించి వేతనాలు సకాలంలో చెల్లించే విధంగా చూడాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా అనేక రకాల షరతులను విధిస్తుంది. ఒక్కొ కూలీ పని చేసే రోజుల్లో రోజుకు రెండు సార్లు ఫోటోలు తీయాలని, పనిచేసే ప్రదేశంలో ఫోటో తియాలని, కూలీలందరికీ పని కల్పించాలని, ఇలా రకరకాల కండిషన్లు పెడుతుంది. దీంతో రాష్ట్రంలో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పైగా వేతనాలు కూడా సరియైన సమయానికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న చట్టంతోనే వేతనాలు సరిగా అందడం లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త చట్టంతో మరెన్ని చిక్కులు వస్తాయోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






