- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vikarabad: దారుణం.. కొడుకుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా(Vikarabad District)లో విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా(Vikarabad District)లో విషాద ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును బావిలో తోసేసి తల్లి ఆత్మహత్య(Scuicide) చేసుకున్నది. నవాబుపేట(Nawabpeta) సమీపంలో ఓ తల్లి గ్రాసం తీసుకొని వద్దాం అని చెప్పి పిల్లలను బావి దగ్గరకి తీసుకెళ్లింది. తన తల్లి ఫోన్‌లో గొడవ పడటం గమణించిన కూతురు.. అనుమానం వచ్చి తాను బావి వద్దకు రానని కేకలు వేసింది. దీంతో పదేళ్ల కూతురు ప్రజ్వలను ఇంటికి వెళ్లమని చెప్పి, కొడుకును బావిలో తోసి వెనువెంటనే తాను కూడా బావిలో పడిపోయింది. దీంతో కొడుకుతో సహా తల్లి మరణించారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గ్రామస్థుల సమాచారంతో నవాబుపేట పోలీసులు సంఘటనా చేరుకున్నారు. బాలిక ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు అక్రమ సంబంధమే కారణం అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






