- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేజస్వి సూర్యపై రాములమ్మ సీరియస్
బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ విభజన కన్నా ఘోరంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని తేజస్వి చేసిన వ్యాఖ్యలు ఉద్యమకారుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను కించపరచే విధంగా ఉన్నాయని ఆగ్రహించారు. పార్లమెంట్ సీట్ల పెంపుదల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ బాధ్యతారహిత కామెంట్స్ పుండుమీద కారం చల్లే విధంగా ఉన్నాయని సీరియస్ అయ్యారు.
ఓ వైపు దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎంపీ తెలంగాణ సెంటిమెంట్ ను కించపరుస్తూ పార్లమెంట్ వేదికగా మాట్లాడటం గర్హనీయమన్నారు. లోకసభ స్పీకర్ ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కోరాలని డిమాండ్ చేశారు. అలా చేసి, ఈ తప్పును సరిదిద్దాలని నేను డిమాండ్ చేస్తున్నానని వెల్లడించారు. తాను, కేసీఆర్ పార్లమెంట్ లోపల బయట తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా పోరాటం చేశామనే విషయాన్ని ఉద్యమకారులను అడిగితే చెబుతారని ఫైర్ అయ్యారు. ఈ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించడం వల్లే సోనియాగాంధీ పెద్దమనసుతో రాష్ట్ర విభజనకు అంగీకరించరన్నారు విజయశాంతి.






