HCA vs SRH: ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ టీమ్.. ఐపీఎల్ టికెట్ల వివాదం! విచారణ షురూ

by Ramesh Naini |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ షురూ అయింది.

HCA vs SRH: ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ టీమ్.. ఐపీఎల్ టికెట్ల వివాదం! విచారణ షురూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ (Vigilance) విచారణ షురూ అయింది. ఈ నేపథ్యంలోనే (Uppal Stadium) ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారులు వచ్చారు. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, స్టేడియం సిబ్బందిని విచారిస్తున్నారు. టికెట్ల అమ్మకం, పాసుల జారీ, తదితర అంశాలపై శ్రీనివాస్‌రెడ్డి వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, టికెట్లు, సాసుల కోసం తమను ఇబ్బంది పెడుతుందని హెచ్‌సీఏపై ఎస్ఆర్‌హెచ్ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాక్షన్ చేపట్టారు. సమగ్ర నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో నిజాలు రాబట్టేందుకు విజిలెన్స్ అధికారులు ఇవాళ రంగంలోకి దిగారు.

కాగా, గతంలోనూ హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సెప్టెంబర్‌ 18న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు సోదాలు చేశారు. ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించే అంతర్జాతీయ మ్యచ్‌లకు రవాణా, క్యాటరింగ్‌ కాంట్రాక్టులు ఇవ్వడంలో కొందరు హెచ్‌సీఏ సభ్యులు అవకతవకలకు పాల్పడ్డట్లు కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈమేరకు సంబంధిత డాక్యుమెంట్లను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story