- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజిలెన్స్ స్పెషల్ డ్రైవ్.. 2,623 వాహనాల తనిఖీ
రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆకస్మికంగా చేపట్టిన రూట్ చెకింగ్‌లో 2,623 వాహనాలను తనిఖీ చేసి..

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆకస్మికంగా చేపట్టిన రూట్ చెకింగ్‌లో 2,623 వాహనాలను తనిఖీ చేసి, 318 వాహనాలు స్వాధీన పరచుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ శిఖా గోయల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ ఎగవేత, చిన్న ఖనిజాలపై సినరేజ్, వ్యవసాయ మార్కెట్ ఫీజు, ఎగవేత దారుల వాహనాలపై తనిఖీలు చేపట్టి రూ.78లక్షల జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆదాయ నష్టాన్ని అరికట్టే లక్ష్యంతో రెండు రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ విజయవంతం అయిందని పేర్కొన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 7యూనిట్లు, 30 ప్రత్యేక బృందాల సమన్వయంతో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. రవాణా నిబంధనల ఉల్లంఘించిన 195 వాహనాలను స్వాధీనం చేసుకుని, రూ.37.45లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. మైనింగ్ చట్టం, జీఎస్టీ చట్టం, వ్యవసాయ మార్కెట్ ఫీజు, వర్తించే చట్టాల ప్రకారం బకాయిలు చెల్లించని 123 వాహనాలను స్వాధీనం చేసుకుని, రూ.40.96లక్షల జరిమానాలు విధించినట్లు తెలిపారు.






