- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజిలెన్స్ తనిఖీలు.. రూ.21 లక్షల పన్ను విధింపు.. 3 జీఎస్టీ కేసులు నమోదు
by Ramesh Naini |
హైదరాబాద్ సిటీ-1 విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్ , రవాణ, గనుల శాఖ అధికారలుతో జరిపిన సయంక్త దాడులలో రూ.21.51లక్షల పన్నులు జరిమానా విధించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సిటీ-1 విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్, రవాణ, గనుల శాఖ అధికారలుతో జరిపిన సయంక్త దాడులలో రూ.21.51లక్షల పన్నులు జరిమానా విధించారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు నాగోల్ క్రాస్ రోడ్స్, చెంగిచెర్ల క్రాస్ రోడ్స్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎంవీఐ, జీఎస్టీ, మైనింగ్ యాక్ట్ క్రింద లైసెన్స్, పన్ను, పర్మిట్ వంటి ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 16 కేసులు నమోదు చేశారు.
వాటిలో జీఎస్టీ ఎగవేత పై 3 కేసులు నమోదు చేశారు. రూ.19.91లక్షల పన్ను ఎగవేతలను గుర్తించారు. దీంతో మైనింగ్ యాక్ట్ కింద 11 కేసులు నమోదు చేసి రూ.1.37లక్ష జరిమానా విధించారు. అలాగే మరో రెండు కేసులు నమోదు చేసి రూ.22 వేల జరిమానా విధించారు.
Next Story






