China manja: మీ సరదా కొందరికి శాపం.. చైనా మాంజాకు చిక్కుకుని కాకి విలవిల

by Ramesh Naini |

సంక్రాంతి పండుగ వచ్చిందంటే పతంగులు సరదాగా ఎగురవేయడం అందరూ చేస్తారు. అయితే కొందరి సరదా మరికొందరికి శాపంగా మారుతుంది.

China manja: మీ సరదా కొందరికి శాపం.. చైనా మాంజాకు చిక్కుకుని కాకి విలవిల
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి (Sankranthi) పండుగ వచ్చిందంటే పతంగులు (Kites) సరదాగా ఎగురవేయడం అందరూ చేస్తారు. అయితే కొందరి సరదా మరికొందరికి శాపంగా మారుతుంది. (Chinese Manja) చైనా మాంజాను వాడొద్దని ప్రభుత్వం చెప్పిన.. అధికారులు నిషేధించిన కూడా కొంతమంది మాత్రం లెక్కచేయడం లేదు. చైనా మంజా వాడుతున్న పతంగుల కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదకరంగా మారింది.

తాజాగా చైనా మాంజాకు చిక్కుకుని ఓ కాకి విలవిలలాడింది. దీంతో అది అందరి మనసు చలించిపోయింది. దాని చుట్టూ ఇతర కాకులు చేరి అరవడం చేశాయి. కాకిని చూసి స్పందించిన బ్లూ క్రాస్ కరీంనగర్ ఇంచార్జ్, సోషల్ వర్కర్ నారాయణ, మరికొందరు స్థానికులు.. ఆర్టీసీ బస్సు ఎక్కి కాకిని క్షేమంగా చైనా మాంజా నుంచి విడిపించారు. కాకి కాళ్లకు చిక్కుకున్న మాంజా దారాన్ని తొలగించి స్వేచ్ఛగా గాలిలోకి ఎగురవేశారు. దీంతో అక్కడున్న అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన కరీంనగర్ బస్టాండ్ వద్ద జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story