- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Golden Ganesha: 70 కేజీలతో బంగారు వినాయకుడి వీడియో వైరల్.. అసలు ట్విస్ట్ ఇదే!
వినాయక చవితి పండగ వేళ బంగారం వినాయకుడి విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా గణేశుడి ఉత్సవాలు ఘనంగా (ganesh chaturthi celebration-2025) ప్రారంభమయ్యాయి. వాడవాడల అందంగా ముస్తాబు చేసిన మండపాల్లో గణనాధుడు కొలువుదీరాడు. ఎప్పటి లాగే ఈసారి కూడా రకరకాల గణపతులు దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో 70 కిలోల బంగారం, 350 కిలోల వెండితో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం అంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విగ్రహం ఏర్పాటుకు రూ.264 కోట్లు ఖర్చు అయినట్లు చెబుతున్నారు. పండగపూట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో వెనుక అసలు మరో ట్విస్ట్ ఉంది. వీడియోలో కనిపిస్తున్న బంగారు వర్ణం విగ్రహానికి 70 కిలోల బంగారం 350 కిలోల వెండితో తయారు చేసిన విగ్రహానికి సంబంధం లేదని పలు ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్లు నివేదించాయి.
70 కేజీల బంగారు విగ్రహం ఎక్కడిది?:
భారీ ఎత్తున బంగారం, వెండిని ఉపయోగించి కోట్లాది రూపాయల వ్యయంతో విగ్రహం ఏర్పాటు చేశారనే విషయం అందరినీ ఆశ్చర్యంలోకి నెడుతోంది. అయితే చెప్పబడుతున్న వివరాలు ముంబయి (Mumbai) కింగ్స్ సర్కిల్‌లోని జీఎస్ బీ సేవామండల్ ద్వారా ప్రతిష్టించబడిన విగ్రహానికి సంబంధించినవి. జీఎస్ బీ సేవామండల్ (GSB Seva Mandal) గణేష్ చతుర్థి వేడుకలకు ప్రసిద్ధి. ప్రతి ఏడాది ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసే విగ్రహానికి పెద్ద మొత్తంలో బంగారం, వెండితో అలంకరిస్తారు. దీంతో దీనికి ముంబయిలోని అత్యంత రిచెస్ట్ గణేష్ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ జరిగే ఉత్సవాలు ఎంత ఫేమసో ఇక్కడ నిర్వహించే వేడుకల కోసం నిర్వాహకులు తీసుకునే ఇన్సూరెన్స్ కూడా అంతే ఫేమస్. ఈ ఏడాది ఉత్సవాల కోసం రూ. రూ.474.46 కోట్ల విలువైన బీమా కవరేజీ చేసుకున్నారు. ఇది గత సంవత్సరం రూ.400 కోట్ల పాలసీ కంటే చాలా ఎక్కువ. దేవతను అలంకరించే బంగారం, వెండి ఆభరణాల విలువ పెరగడంతో పాటు, పాలసీ కింద ఎక్కువ మంది స్వచ్ఛంద సేవకులు, పూజారులను చేర్చడం వల్ల బీమా కవరేజీ పెంచినట్లు నిర్వాహకులు తెలిపారు.






