HYD: కూకట్‌పల్లిలో విక్టరీ వెంకటేశ్ సందడి

by Gantepaka Srikanth |

భాగ్యనగర పసిడి ప్రియుల చిరకాల వాంఛ నెరవేరుస్తూ, కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో 'మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్' మెగా షోరూం ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

HYD: కూకట్‌పల్లిలో విక్టరీ వెంకటేశ్ సందడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: భాగ్యనగర పసిడి ప్రియుల చిరకాల వాంఛ నెరవేరుస్తూ, కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో 'మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్' మెగా షోరూం ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జంట నగరాల్లోనే అతిపెద్దదిగా, నాలుగు అంతస్తుల విశాలమైన భవనంలో అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూంను ప్రముఖ సినీ నటుడు, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. షోరూంలోని అద్భుతమైన కలెక్షన్లను తిలకించిన వెంకటేష్ మాట్లాడుతూ, ‘హైదరాబాద్ ప్రజలకు వేలాది సరికొత్త డిజైన్లను ఒకే చోట అందించడం అభినందనీయం. ముఖ్యంగా సామాన్యులకు భారం కాకుండా సంవత్సరం పొడవునా అతితక్కువ తరుగు ధరలకే బంగారం అందించాలనే యాజమాన్యం ఆలోచన చాలా గొప్పది’ అని కొనియాడారు.

Next Story