- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంపై కాంగ్రెస్ నేత వీహెచ్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతున్న మార్వాడీ గో బ్యాక్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నేత వి. హన్మంతరావు స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతున్న మార్వాడీ గో బ్యాక్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నేత వి. హన్మంతరావు స్పందించారు. మార్వాడీలకు ఆయన మద్దతు పలికారు. మంగళవారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని, తరతరాలుగా మార్వాడీలు తెలంగాణలో ఉంటున్నారని చెప్పారు. కానీ మార్వాడీలను గో బ్యాక్ అనడం ఏంటి, ఇది సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. రిలయన్స్, డీ మార్ట్ లాంటి బడా కంపెనీలలో అన్ని వస్తువులు దొరుకుతున్నాయని, మరి వాళ్ళను ఎందుకు గో బ్యాక్ అనడం లేదని వీహెచ్ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని, దీంతో ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారన్నారు. ఈ విధమైన నినాదాలతో అభివృద్ధి కుంటు పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు.






