ప‌శుసంవ‌ర్ధక శాఖ‌ను బలోపేతం చేయండి.. రైతు కమిషన్‌కు వెటర్నరీ డాక్టర్స్ వినతి

by Ramesh Naini |

రాష్ట్రంలో పాడి ప‌శువుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ వెట‌ర్నరీ డాక్టర్స్ అసోసియేష‌న్ ప్రతినిధులు అన్నారు.

ప‌శుసంవ‌ర్ధక శాఖ‌ను బలోపేతం చేయండి.. రైతు కమిషన్‌కు వెటర్నరీ డాక్టర్స్ వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాడి ప‌శువుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ వెట‌ర్నరీ డాక్టర్స్ అసోసియేష‌న్ (animal husbandry department) ప్రతినిధులు కోరారు. గురువారం బీఆర్కే భ‌వ‌న్ లోని రైతు క‌మిష‌న్ కార్యాల‌యంలో తెలంగాణ వెట‌ర్నరీ డాక్టర్స్ అసోసియేష‌న్ ప్రతినిధులు చైర్మన్ కోదండ‌రెడ్డి కలిసి సమస్యలను వివరించారు. గ‌త ప‌దేండ్లుగా పాడి ప‌రిశ్రమ కుంటుప‌డింద‌ని, ప్రస్తుత ప్రభుత్వం పాడిప‌రిశ్రమ అభివృద్ధి కోసం నిధులు, నియ‌మ‌కాలు చేప‌ట్టాల‌న్నారు. ప‌శుసంవ‌ర్ధక శాఖ‌లో నెల కొన్న పలు స‌మ‌స్యలు, శాఖ అభివృద్ధి కోసం చేప‌ట్టాల్సిన అంశాల‌ను అసోసియేష‌న్ ప్రతినిధులు చైర్మన్ కు వివ‌రించి, విన‌తి ప‌త్రం అందజేశారు.

ప్రధానంగా ప్రభుత్వమే ప‌శువుల‌కు ఇన్సురెన్స్ డ‌బ్బులు చెల్లించాలని, రెగ్యూల‌ర్ గా గొర్రెల‌కు, మేక‌ల‌కు న‌ట్టల మందులను పంపిణి చేయ‌డంతో పాటు హెల్త్ క్యాంపుల‌ను నిర్వహించాల‌న్నారు. ప‌శుసంవ‌ర్థక శాఖ‌లో ఖాళీగా ఉన్న వెట‌ర్నరీ డాక్టర్స్ పోస్టులు, ఇత‌ర పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని కోరారు. డివిజ‌న్ స్థాయి నుంచే ప‌శుసంవ‌ర్ధక శాఖ‌ను బ‌లోపేతం చేసిన‌ప్పుడే, డిపార్ట్ మెంట్ పూర్తిస్థాయిలో బలపడుతుందని తెలిపారు. పాడి ప‌రిశ్రమ అభివృద్ధి చెందితేనే రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం పెరుగుతుంద‌ని ప్రతినిధులు తెలిపారు. ఐతే ప‌శుసంవ‌ర్ధక శాఖలోని స‌మ‌స్యల‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామ‌ని క‌మిష‌న్ చైర్మన్ కొదండ‌రెడ్డి హామీ ఇచ్చారు. రైతు క‌మిష‌న్ చైర్మన్ కొదండ‌రెడ్డిని క‌లిసిన వారిలో తెలంగాణ వెట‌ర్నరీ డాక్టర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ర‌మేష్ బాబు, శ్రీధ‌ర్ రెడ్డి, కిర‌ణ్ కుమార్, విజయలక్ష్మి ఇత‌ర ప్రతినిధులు ఉన్నారు.

Next Story