ఈటెల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మాటల దాడులు : బీజేపీ ఎమ్మెల్యేలు

by Muthe.Rajitha |

గ్రేట‌ర్ ప‌రిధిలో పేద‌ల ఇళ్లను కూల్చివేతలపై ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ప్రశ్నలకు స‌మాధానం చెప్పకుండా కాంగ్రెస్ నేత‌లు పిసిసి చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామ‌ల , జ‌గ్గారెడ్డి ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

ఈటెల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మాటల దాడులు : బీజేపీ ఎమ్మెల్యేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేట‌ర్ ప‌రిధిలో పేద‌ల ఇళ్లను కూల్చివేతలపై ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ప్రశ్నలకు స‌మాధానం చెప్పకుండా కాంగ్రెస్ నేత‌లు పిసిసి చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామ‌ల , జ‌గ్గారెడ్డి ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మంగళవారం దన్​పాల్​సూర్యనారాయణ గుప్త, రామారావు పవార్, రాకేష్​రెడ్డి, హరీష్​ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విరుచుక పడ్డారు. ఇష్టానుసారంగా పేద‌ల ఇళ్లను కూల్చివేస్తూ తుగ్లక్ పాల‌న సాగిస్తున్న ముఖ్యమంత్రి ఓ సైకోలా, శాడిస్టుల వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. పేద‌ల‌కు ఎలాంటి పున‌రావాసం క‌ల్పించ‌కుండా వారి నివాసాల‌ను హైడ్రా సంస్ధ కూల్చివేస్తుండ‌డంతో, పేద‌లు నిర్వాసితులు అవుతున్న అంశంపై సీఎం స్పందించాలని డిమాండ్​చేశారు. పేద‌ల పునరావ‌సం గురించి మాట్లాకుండా ఈటె రాజేంద‌ర్ పై కాంగ్రెస్ నేత‌లతో ఎదురు దాడి చేయించ‌డం ముమ్మాటికీ దివాళాకోరు రాజ‌కీయ‌మేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ‌ట్టలు విప్పి గుంజీలు తీయిస్తానంటూ కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి మాట్లాడ‌డం ఆయ‌న చిల్లర రాజ‌కీయాల‌కు అద్దం ప‌డుతోంది. కాంగ్రెస్ నేత‌ల కామెంట్లు చూస్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టునే చ‌దివిన‌ట్టు ఉంది. ప్రాప‌కం కోసం, ప‌ద‌వుల కోసం కాంగ్రెస్ నేత‌లు ఈటెలపై విమర్శలు చేశారని పేర్కొన్నారు. పేద‌ల ఇళ్లను కూల్చుతున్న హైడ్రాకు హైద‌రాబాదు పాత‌బ‌స్తీలో ఓ చెరువును ఆక్రమించి ఎంఐఎం అధినేత ఓవైసీ నిర్మించిన కాలేజీని కూల్చే ద‌మ్ము లేదా, ఎందుక‌ని బుల్డోజ‌ర్లు పాత‌బ‌స్తీకి పోలేక‌పోతున్నాయని నిలదీశారు. అక‌డిమిక్ ఇయ‌ర్ మ‌ధ్యలో కూల్చితే విద్యార్ధులు న‌ష్టపోతార‌ని చెప్పిన హైడ్రాకు ఇపుడు వేస‌వి సెల‌వుల‌ని గుర్తులేదా అని ప్రశ్నించారు.

Next Story