ఈ 6 రాశాలకు 2027 సెప్టెంబర్ నుండి అష్ట దరిద్రమే.. వేణుస్వామి సంచలన జోస్యం

by Ajay Maddhiboyina |

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాపై జోస్యం చెప్పిన వేణుస్వామి మ‌రో వీడియో చేశారు. చాలామంది ఆయ‌న రాజీనామా చేయ‌ర‌ని అన్నార‌ని, కానీ తాను చెప్పిందే జ‌రిగింద‌న్నారు.

ఈ 6 రాశాలకు 2027 సెప్టెంబర్ నుండి అష్ట దరిద్రమే.. వేణుస్వామి సంచలన జోస్యం
X

దిశ, వెబ్ డెస్క్: ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాపై జోస్యం చెప్పిన వేణుస్వామి మ‌రో వీడియో రిలీజ్ చేశారు. చాలామంది ఆయ‌న రాజీనామా చేయ‌ర‌ని అన్నార‌ని, కానీ తాను చెప్పిందే జ‌రిగింద‌న్నారు. మ‌రోవైపు 2027 సెప్టెంబ‌ర్ నుండి కొన్ని రాశాల వారికి చాలా స‌మ‌స్య‌లు రాబోతున్నాయ‌ని జోస్యం చెప్పారు. మేష‌రాశి, క‌న్యారాశి, వృశ్చిక‌రాశి, మీన‌రాశి, మ‌క‌ర‌రాశి, వృష‌భ‌రాశుల‌ వారికి ఆర్థికంగా, సామాజికంగా, న్యాయ‌ప‌రంగా, కుటుంబ ప‌రంగా విప‌రీత‌మైన సమ‌స్య‌లు వ‌స్తాయ‌ని అన్నారు. మేష‌రాశి, క‌న్యారాశి, వృశ్చిక‌రాశి, మీన‌రాశి వారికి వంద‌కు వంద‌శాతం స‌మ‌స్య‌లు ఎదురవుతాయ‌ని చెప్పారు. మ‌క‌ర‌రాశి, వృష‌భ‌రాశుల‌వారికి వంద‌కు తొంబై శాతం స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని అన్నారు.

ఈ ఆరు రాశులవారు విప‌రీత‌మైన సంచ‌ల‌నాలు, ఇబ్బందులు ఎందుర్కొంటార‌న్నారు. ప‌రువు న‌ష్టం, ఆరోగ్య స‌మ‌స్య‌లు, సంప‌న్న‌వ‌ర్గాల్లో ఈడీ, ఇన్ క‌మ్ ట్యాక్స్ స‌మ‌స్య‌లు, రాజ‌కీయ‌నాయ‌కులు సెల‌బ్రెటీల‌కు అదే విధంగా మీడియా రంగంలో ప‌నిచేసేవాళ్లకు కూడా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్నారు. ఇప్పుడు ఈ రాశుల‌వారు చేసే ప‌నుల వ‌ల్ల 2027 సెప్టెంబ‌ర్ నుండి స‌మ‌స్య‌లు వ‌స్తాయని చెప్పారు. రెండున్న‌రేళ్ల‌పాటు వీరికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్నారు. ఈ రాశుల వారు ఇప్ప‌టి నుండే జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఖ‌ర్చులు తగ్గించుకోవాల‌ని, వివాదాల‌కు దూరంగా ఉండాల‌న్నారు. ఈగోను త‌గ్గించుకుని బ‌త‌కాల‌ని సూచించారు. ఎవరికి అప్పులు ఇవ్వవద్దని, అత్యాశతో కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దని చెప్పారు.

Next Story