కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారు: మాజీ మంత్రి సెటైర్

by Gantepaka Srikanth |

ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ కార్ రేస్‌లో విచారణకు గవర్నర్ అనుమతి తెలపడం కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్‌ఎస్ పార్టీపై కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లమైందని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారు: మాజీ మంత్రి సెటైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ కార్ రేస్‌లో విచారణకు గవర్నర్ అనుమతి తెలపడం కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్‌ఎస్ పార్టీపై కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లమైందని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ను కట్టడి చేయలేక, కేటీఆర్‌ను ఎదుర్కోలేక.. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇలాంటి కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్‌పై విచారణ పేరుతో కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. కుట్రలను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని పేర్కొన్నారు.

Next Story