కొండెక్కిన కూరగాయలు

by velandi.Saikiran |

తెలంగాణలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకూ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

కొండెక్కిన కూరగాయలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకూ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. బీన్స్, చిక్కుడు, బీరగాయ, పచ్చిమిర్చి, దొండకాయ, వంకాయ ఇలా అన్ని కూరగాయల రేట్లు రెట్టింపు అయ్యాయి. పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతికూర వంటి ఆకుకూరల రేట్లు సైతం పిరమయ్యాయి. నిన్నా మొన్నటి వరకు ఎండలు, తాజాగా వర్షాభావ పరిస్థితులు వల్ల సాగు తగ్గిందని, అందుకే ధరలకు రెక్కలొచ్చాయని రైతులు చెబుతున్నారు.

భారీగా తగ్గిన ఉత్పత్తి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం, సాగునీటి వసతి, ఇతర కారణాల వల్ల కూరగాయలు పండించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో సాగు భారీగా పడిపోయింది. రైతుబజార్లలో సరుకు లేకపోవడంతో విక్రయదారులు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాల్లోని వ్యాపారులు హైదరాబాద్, కర్నూలు వంటి ప్రాంతాల నుంచి సరుకు తెప్పించుకుని విక్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటంతో దళారులు ధరలు పెంచేశారు. వారి నుంచి కొనుగోలు చేస్తున్న చిన్న వ్యాపారులు సైతం ధరలను అమాంతం పెంచడంతో వినియోగదారులపై పెను భారం పడుతోంది.

ధరలు ఇలా..

టమాటా రూ.60 నుంచి రూ.70, బీన్స్ రైతు బజార్‍లో కిలో రూ.100 ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. చిక్కుడుకాయ రైతు బజార్‍లో రూ.70 నుంచి రూ.80 ఉండగా.. బయట మార్కెట్‌లో రూ.150 వరకూ అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కిలో రూ.80 ఉండగా.. రిటైల్ మార్కెట్ లో రూ.120 దాకా విక్రయిస్తున్నారు.

Next Story