సమస్యకు ఆత్మహత్య.. పరిష్కారం కాదు.. కానిస్టేబుల్ సూసైడ్‌పై స్పందించిన సజ్జనార్

by Ramesh Naini |   (  Updated:2025-11-09 10:49:06  IST  )

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఓ కానిస్టేబుల్ ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు.

సమస్యకు ఆత్మహత్య.. పరిష్కారం కాదు.. కానిస్టేబుల్ సూసైడ్‌పై స్పందించిన సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Online betting) ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఓ కానిస్టేబుల్ ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. ‘సమస్యకు ఆత్మహత్య.. పరిష్కారం కాదు. మీ ప్రాణం చుట్టూ ఎన్నో బంధాలు, ఇంకెన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి. సమస్యలు వచ్చాయని, కష్టాలు ఎదురయ్యాయని క్షణికావేశంలో మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఆ బంధాలను, వాళ్ళ జీవితాలను నరకప్రాయంగా మార్చేస్తాయి. వద్దు.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వద్దు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఉప్పల్‌లోని మల్లికార్జున నగర్‌లో నివసించే డి. శ్రీకాంత్ (42) గత నెల 23 నుంచి విధులకు హాజరు కాకపోవడంతో.. శనివారం స్టేషన్ నుంచి నోటీసు వచ్చింది. అనంతరం ఇంట్లోకెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌తో గతంలో పెద్దమొత్తంలో నగదును పోగొట్టుకున్న శ్రీకాంత్ జియాగూడలో ఉన్న ఇంటిని అమ్మేసి అప్పులు చెల్లించాడు. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తండ్రి మాణిక్ రావు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..

READ MORE .....

డబ్బులు ఎవరికీ ఊరికే రావు : సీపీ సజ్జనార్

Next Story