Uttam Kumar Reddy: కేసీఆర్ సర్కార్ నాసిరకం పనులతో కాళేశ్వరం నాశనం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Prasad Jukanti |

ఎన్డీఎస్ఏ రిపోర్టు పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Uttam Kumar Reddy: కేసీఆర్ సర్కార్ నాసిరకం పనులతో కాళేశ్వరం నాశనం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ (KCR) సర్కార్ నాసిరకం పనులతో కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులను నాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్టు చెప్పిందని అన్నారు. ఇవాళ హైదరాబాద్ ఎచ్ఐసీసీ భారత్ సమ్మిట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలా రూ. లక్షల కోట్లు వృథా చేస్తే ఇతర దేశాల్లో కఠిన శిక్షలు పడేవన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిరుపుయోగంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అత్యధిక పంట పండిందని, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చెప్పారు.

బీఆర్ఎస్ పదేళ్లలో చేయనిది చేసి చూపాం:

రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అనుమతుల విషంలో ఏడాదిన్నరగా మేం చేసిన కృషి ఫలించిందని ఉత్తమ్ అన్నారు. సీతారామసాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలంగాణకు ఇది పెద్ద ముందడుగు అని తెలిపారు. దశాబ్దకాలంగా బీఆర్ఎస్ సాధించలేనిది మేము ఏడాదిన్నరలోనే సాధించామన్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఉపయోగకరం అవుతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ తో జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు అవసరమైన పరిహారం, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story