- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uttam Kumar: మంత్రుల మధ్య విభేదాలపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కేబినెట్ మంత్రుల మధ్య విభేదాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పందించారు. మంత్రుల మధ్య సమన్వయం ఉందని విభేదాలు లేవన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన నా శాఖ, నా జిల్లా అభివృధి పనులపై ఫోకస్ పెట్టానని ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు. బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయని ప్రాసెస్ అంతా నేనే దగ్గరుండి చూశానన్నారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్నా మా హక్కులను వదులుకోబోమన్నారు. బనకచర్ల, ఆల్మట్టిపై మేము నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నామని కృష్ణా, గోదావరిలో నీటి వాటాల కోసం ప్రభుత్వం కమిట్మెంట్‍తో పనిచేస్తోందన్నారు.
త్వరలోనే మహారాష్ట్ర వెళ్తున్నాం..
కేసీఆర్ పదేళ్లలో చేసిందేమి లేదని కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా భారత దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంటలు పండాయని త్వరలోనే మహారాష్ట్ర వెళ్లబోతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం 25 వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నామని మంత్రి వెల్లడించారు.






