- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుకు గుదిబండలా యూరియా యాప్.. APK ఫైల్స్‌తో సైబర్ కేటుగాళ్ల కుచ్చుటోపీ
రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టే యాప్‌లను వినియోగించాలంటే రైతులు వణికిపోతున్నారు. ఏపీకే పేరుతో ఫైల్ రావడంతో వాటిని ఓపెన్ చేయగా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు ఖాళీ అవుతుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ప్రవేశ పెట్టే యాప్‌లను వినియోగించాలంటే రైతులు వణికిపోతున్నారు. ఏపీకే పేరుతో ఫైల్ రావడంతో వాటిని ఓపెన్ చేయగా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు ఖాళీ అవుతుంది. ఇటీవల ప్రభుత్వం యూరియా కొనుగోలు యాప్‌ను ఐదు జిల్లాల్లో అమలు చేస్తూ అవసరమైన రైతులు యాప్ డౌన్లోడ్ చేసుకుని కావాల్సిన యూరియాను బుకింగ్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది. ఈ యాప్‌ను పెద్దపల్లి జిల్లాలకు వ్యవసాయశాఖ అధికారి యాప్‌డౌన్ లోడ్చేస్తే రూ. 5 లక్షలు కేటుగాళ్లు కొట్టేశారు. దీంతో సదరు అధికారి సమీప పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రైతులు వ్యవసాయ శాఖ తీసుకొచ్చే యాప్‌ను వినియోగించాలంటే జంకుతున్నారు. వ్యవసాయంలో పెట్టుబడి కోసం బ్యాంకులో నగదు జమ చేస్తే యాప్కారణంగా నష్టపోవాల్సి వస్తోంది. రైతు భరోసా, క్రాప్‌బుకింగ్, ఏఈవో కార్యకలాపాలు, పంట రుణాల యాప్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. నకిలీ యాప్‌కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసి రైతులు నిలువునా ముంచే విధంగా చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు కాసులకు కక్కుర్తి పడి తమకు కమిషన్లు ఇచ్చి ఏజెన్సీలకు యాప్‌కు సంబంధించిన నిర్వహణ బాధ్యతలు ఇస్తుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏపీకే యాప్‌ను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తమ సొంతానికి వాడే సెల్పోన్లో డౌన్‌లోడ్‌చేస్తే వారికి యాప్‌ద్వారా వచ్చే సమస్యలు తెలుస్తాయని పేర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ అమలు యాప్‌ను ప్రతి ఏటా రెండు సీజన్‌లో 70 లక్షల మంది రైతులు వినియోగిస్తున్నారు. వీరిలో చాలామంది ఇలాంటి యాప్‌లను వాడి నగదు పోగొట్టుకున్నారు.
8 రకాల యాప్‌ల వినియోగం..
రైతులకు సులువైన సేవలందిచేందుకు ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి 8 రకాల యాప్‌లను అమలు చేస్తోంది. రైతు భరోసా, అగ్రిస్టాక్, డీసీఎస్, ఏఈవోల యాక్టివిటీ లాగర్యాప్, క్రాప్బుకింగ్హెన్హచ్చమెంట్, ఫైవీస్, క్రాప్‌లోన్స్, ఫార్మర్యూరియా యాప్‌ద్వారా సేవలందిస్తోంది. వీటి ప్రవేశపెట్టే ఉద్దేశ్యం మంచిదైనా దానితో లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. యాప్‌లో ఏ విధంగా వాడాలో రైతులు సరిగ్గా తెలియదు. ప్రభుత్వం ఏది చేసిన సక్రమంగా ఉంటుందని నమ్మితే అసలుకే మోసం వస్తోంది. ఆన్లైన్కేటుగాళ్లు బలికాక తప్పడం లేదు. ఇప్పటివరకు అమలు చేసే వ్యవసాయ శాఖ యాప్‌లు ఐపోన్‌లో సపోర్టు చేయడం లేదు. కేవలం ఆండ్రాయిడ్పోన్లకే మాత్రం పనిచేస్తున్నాయి. రైతులు లక్షల రూపాయలు ఖరీదు చేసే ఫోన్కొనుగోలు చేయడం అందరికి సాధ్యం కాదు. వీరి బలహీనతలను ఆసరాగా తీసుకుని సైబర్‌కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం యాప్వ్యవస్ధలను తీసుకొచ్చిన అవి రైతులు నష్టపరిచే విధంగా ఉండకుండా చూడాలని అన్నదాతలు సూచనలు చేస్తున్నారు.
ప్రైవేటు ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు..
ప్రజలకు ఎంతో భరోసా కల్పించే జాతీయ సమాచార సెంటర్ఉండగా ప్రైవేటు ఏజెన్సీ టీమ్ఆప్సంస్ధకు యాప్ నిర్వహణ బాధ్యతలు ఇవ్వడంపై వ్యవసాయ శాఖపై విమర్శలు ఉన్నాయి. గతంలో వ్యవసాయ కార్యదర్శిగా పనిచేసిన సీనియర్అధికారి అనుకూలమైన సంస్ధకు ఇవ్వడంతో ఇలాంటి సమస్యలు వచ్చినట్లు మండల వ్యవసాయధికారులు వాపోతున్నారు. ఒక యాప్‌కు నిర్వహణకు ఏటా రూ. 50 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. దానికి అయ్యే ఖర్చుకంటే ఉన్నతాధికారులు జేబులోకి వెళ్లే వాటాలు ఎక్కువ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సంస్ధకు లాభాలు ఆశించిన మేరకు రావడం లేదని నాణ్యతలేని యాప్‌లను రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విధంగా ప్రభుత్వం ఇష్టానుసారంగా యాప్‌లు తీసుకొచ్చి అన్నదాతలకు ఇబ్బందులు కలిగిస్తే అధికారులపై తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాయి.
READ MORE ....
అన్నదాతలకు బిగ్ అలర్ట్.. జిల్లాల వారీగా యూరియా నిల్వల డేటా విడుదల






