TG: ఉర్దూ పాఠశాలల పనివేళలు మార్పు

by Gantepaka Srikanth |

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళలను మారుస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.

TG: ఉర్దూ పాఠశాలల పనివేళలు మార్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళలను మారుస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న రంజాన్ మాసం దృష్ట్యా ఉపాధ్యాయులు, విద్యార్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుండి మార్చి 20 వరకు పాఠశాల సమయాన్ని ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మార్పు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం పాఠశాలలు, సాధారణ పాఠశాలల్లోని ఉర్దూ మీడియం సెక్షన్లు, డైట్ కాలేజీలకు ఇది వర్తిస్తుంది. పనివేళల మార్పు వల్ల తగ్గిన పని గంటలను భర్తీ చేసేందుకు విద్యాశాఖ కొన్ని సూచనలు చేసింది. అప్పర్ ప్రైమరీ, సెకండరీ పాఠశాలలు ఒక అదనపు పనిదినం పని చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రైమరీ పాఠశాలలు గత ఏడాది తరహాలోనే, ఏవైనా రెండు పనిదినాల్లో అదనంగా అరగంట పాటు పని చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈఓలను ఆదేశించారు.

Next Story