ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి మృతి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-08 07:30:08  IST  )

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి (Bandaru Rajireddy) ఇవాళ కన్నుమూశారు.

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి మృతి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి (Bandaru Rajireddy) ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాజిరెడ్డి మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులర్పిస్తున్నారు. అయితే, బండారు రాజిరెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితాన్ని మొత్తం ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి రాజిరెడ్డి అని కొనియాడారు. అటు కాంగ్రెస్ పార్టీకి.. ఇటు ఉప్పల్ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను ఎవరూ మరువలేనివని అన్నారు. ఈ కష్ట కాలంలో రాజిరెడ్డి కుటుంబానికి ఆ భగవంతుడు శక్తితో పాటు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story